Central Committee Member

  • Home
  • Central Committee Member

Sn. Dr. Katikala.Siva Bhagyarao IRS VRS

Founder & Chairman
CWC Member

English Version

Katikala Siva Bhagya Rao is a former Indian Revenue Service officer who is voluntarily retired in the position of Deputy Commissioner of Income Tax in 2014. He is a philanthropist, social entrepreneur and media personality. He is the founder chairman of Sneha Telivision Group. He also founded Sneha Club, Marriage Bureau, Snehawaani, Macs, Chits, Print, Electronic Media and a FPC. He has been awarded doctorate by Westbrook University of the United States.

@ Early Life

Siva Bhagya Rao was born in 1960 in Chintalapudi village, Ponnur Mandal in Guntur Dist, Andhra Pradesh. He was born to Katikala George alias Rama Koti and Katikala Kanthamma in a poor family belonging to scheduled caste.He is graduated from Guntur AC college. Since early days, he is inclined towards social welfare activities at his level. Taking inspiration from Dr BR Ambedkar, he had founded Ambedkar Yuvajana Sangham and established circulating libraries in the nearby villages.He encouraged talented poor students and provided them free tuition and awards,Moved by the poor and underprivileged sections in his region, Siva Bhagya Rao had spoken to the local VRO (Village Revenue Officer) and got sanctioned 25 cents land each to 82 families financial growth of d poor families

Katikala Siva Bhagya Rao is married to Swarna Latha. His wife had worked for Andhra Bank and opted for voluntary retirement. The couple is blessed with two sons - Katikala Kranthi Kumar and Katikala Srikanth. Siva Bhagya Rao's brother Katikala Venkat Rao is an Indian Defence Accounts Service (IDAS) officer. He is working as the Controller of Defence Accounts. Siva Bhagya Rao is settled in Hyderabad, Telangana.

@ Career

He started his career as an UDC (Upper Divisional Clerk) in the Central Excise Department in 1985. Though he had got four job opportunities at once, he opted for the job at Income Tax Department as an Inspector in the Investigation Department, Hyderabad in d year 1988.He continued his education while working and certified in PGDPM (Post Graduation Diploma in Personal Management) and Law. He had received 72 commendation letters for his impressive performance at his work in the Income Tax department. The commendation letters he had received include from the likes of GR Reddy, Chandrasekharan, MS Reddy, commissioners and Officer Duvvuri Seshaiah. Through his performance, he improved his ranks in his job. He subsequently secured IRS cadre. And he got retired as the Deputy Commissioner of Income Tax from the same office in Hyderabad where he had joined as the Inspector.

Post retirement, he emerged as a social entrepreneur without leaving his tryst with social service. He has successfully founded Sneha Television. Currently, he is preparing ground for starting a TV channel with the principles of Dr BR Ambedkar. Plans are afoot to launch the channel, named as Master Key Channel (Ambedkar Channel) on the death anniversary of Dr BR Ambedkar, the major architect of the Constitution of India.

@ Social Service

Katikala Siva Bhagya Rao firmly believes in giving back to society. He has taken up several social service and philanthropic activities in his capacity. With the help of wife Katikala Swarnalatha, brother Katikala Venkat Rao and father George, libraries were established in about 30 villages. In 2000, a trust has been founded in the name of his mother Katikala Kanthamma Educational Society. The trust is catering its social services in 45 villages. He started Sneha Club with the like-minded people in 2001. The club has expanded exponentially with over 12,000 members and multiplied its branches. In Andhra Pradesh and Telangana states, Sneha Club has about 202 branches . The club has also set up its branches in Karnataka and Maharashtra. The club had conducted several programs in villages and Social welfare hostels by interacting with people and children on Saturdays and Sundays. The club has also provided employment to over 2000 people.

@ Media

K Siva Bhagya Rao's tryst with media began with the launching of Snehawaani circulated news paper In 2002 he started Sneha TV on the eve of Independence Day celebrations on 15-8 -2016 .The operations of Master Key channel (Dr Ambedkar channel) will begin commemorating the death anniversary of Dr Ambedkar and on the occasion of Centenary celebrations of mook nayak paper .The TV channel will be operated through crowd-funding. On the eve of Mahatma Jyotiba phule birthday,April 11, 2020, the channel's YouTube live was telecasted. Women will play crucial role in the channel's operation. Lady directors have been appointed to helm the channel's key affairs.

Telugu Version

@ వ్య‌క్తిగ‌త వివ‌రాలు

జననం: చింత‌ల‌పూడి గ్రామం, పొన్నూరు మండ‌లం, గుంటూరు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, భార‌త‌దేశం.
నివాసం: హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత: భారతీయుడు
వృత్తి: మాజీ ఐ.ఆర్‌.ఎస్‌.అధికారి, సోష‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌
క్రియాశీలక సంవత్సరాలు: 1985 నుంచి ప్ర‌స్తుతం
జీవిత భాగస్వామి: క‌టిక‌ల స్వ‌ర్ణ‌ల‌త‌, ( వీఆర్) ఆంధ్ర‌బ్యాంక్‌
సంతానము: క‌టిక‌ల క్రాంతికుమార్‌, క‌టిక‌ల శ్రీకాంత్‌
త‌మ్ముడు: క‌టిక‌ల వెంక‌ట్రావు, ఐడిఏఎస్, అడిష‌న‌ల్ కంట్రోల‌ర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌
పూర్వ విద్యార్థి: ఏసీ కాలేజ్‌, గుంటూరు
మతం: క్రిస్టియ‌న్‌
పుర‌స్కారాలు: సామాజిక సేవ‌లో గౌర‌వ డాక్ట‌రేటు, వెస్ట్ బ్రూక్ యూనివ‌ర్సిటీ, అమెరికా

డాక్టర్ కటికల శివ భాగ్యారావు మాజీ ఐ.ఆర్.ఎస్ అధికారి. 2014లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారి హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన సివిల్ సర్వెంట్ మాత్రమే కాదు... సోషల్ ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంత్రఫిస్ట్, మీడియా పర్సనాలిటీ, ఎంటర్ప్రెన్యూర్. స్నేహ క్లబ్, స్నేహ మ్యాక్స్, స్నేహ మ్యారేజ్ బ్యూరో, స్నేహ వాణి, స్నేహ చిట్స్, స్నేహ టెలివిజన్ సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. చదువుతూ, ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూనే... సమాజ సంక్షేమం గురించి ఆలోచిస్తూ ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు శివ భాగ్యారావు. ప్ర‌స్తుతం సోషల్ ఎంటర్ప్రెన్యూర్ గా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయ‌న చేసిన సేవ‌కిగానూ యు.ఎస్.ఎ కి చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

@ బాల్యం... విద్యాభ్యాసం

గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం, చింతలపూడిలో 1960లో జన్మించారు. కటికల జార్జ్ ఉరఫ్ రామకోటి, కటికల కాంతమ్మ ఆయన తల్లిదండ్రులు. పేద ఎస్సీ కుటుంబంలో జన్మించిన శివభాగ్యారావు గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ విద్యనభ్యసించారు. విద్యార్థి దశలో, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నప్పుడే సామాజిక సేవపై దృష్టిపెట్టారు. అంబేడ్కర్ యువజన సంఘం స్థాపించి గ్రామాల్లో గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయడం, ప్రతిభగల విద్యార్థుల్ని ప్రోత్సహించడం, ఉచిత ట్యూషన్లు చెప్పించడం... ఇలా పలు కార్యక్రమాల్ని చేపట్టారు. ఉద్యోగం చేస్తూనే పిజీ డీపీయం లో, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

@ ఉద్యోగ ప్రస్థానం (1985-2014)

కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో యుడీసీగా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ఒకే యేడాదిలోనే నాలుగు ఉద్యోగాలు పొందినప్పటికే ఇంక‌మ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్ట‌రుగా చేరారు. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో తొలి బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే విభాగంలోనే, అక్కడే డిప్యూటీ కమీషనర్ గా పదవీ విరమణ పొందడం విశేషం. ఇన్స్పెక్టర్ హోదా నుంచి అంచలంచెలుగా ఎదిగారు. ఐ.ఆర్.ఎస్ హోదా అందుకున్నారు. అత్యుత్తమ సేవలు అందించినందుకు గానూ వృత్తిపరంగా 72 కమెండేషన్ లెటర్లు అందుకోవడం విశేషం. జి.ఆర్.రెడ్డి, చంద్రశేఖరన్, ఎమ్.ఎస్.రెడ్డి, ఆఫీస‌ర్ దువ్వూరి శేష‌య్య తదితర కమిషనర్ల నుంచి కమెండేషన్ లెటర్లు అందుకున్న శివభాగ్యారావు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఆ తర్వాత పూర్తిస్థాయిలో సామాజిక సేవకి అంకితమయ్యారు. సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ గాకూడా అడుగుపెట్టిన ఆయన అందులో కూడా సామాజిక సేవా థృక్కోణాన్ని వదిలిపెట్టలేదు. ప్రస్తుతం స్నేహ టీవీని విజ‌య‌వంతంగా న‌డుపుతున్న ఆయ‌న అంబేడ్కర్ టీవీ ఛానెల్‌ని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు.

@ సేవా ప్రస్థానం

అంబేడ్కర్ జీవితం, ఆయ‌న ఆశ‌యాలే స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్య‌క్ర‌మాల‌వైపు దృష్టిపెట్టారు క‌టిక‌ల శివ భాగ్యారావు. సమాజానికి మనం తిరిగి ఏం ఇవ్వగలమనే ఆలోచనతో విద్యార్థి ద‌శ‌లోనే ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌టికి అడుగుపెట్టారు. తండ్రి కటికాల జార్జ్ ఉరఫ్ రామకోటి నుంచి అబ్బిన నాయకత్వ లక్షణాలు కూడా అందుకు ప్రధాన కారణమయ్యాయి. సొంతూరిలో అంబేడ్కర్ యువజన సంఘం స్థాపించారు. తన తోటి విద్యార్థులు, జూనియర్లు, సీనియర్లని కలుపుకుని గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఉచిత ట్యూషన్లు నెలకొల్పారు. ప్రతిభ గల విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లకి అండగా నిలిచారు. పేద‌రికంతో మ‌గ్గుతున్న కొన్ని కుటుంబాల ప‌రిస్థితిని చూసి స్థానిక వీఆర్వోతో మాట్లాడి... తుంగభద్ర కాలువ సమీపంలో నిరుపయోగంగా ఉన్న భూమిని ఒకొక్కరికి 25 సెంట్ల చొప్పున 82 మంది పేదలకు ఇప్పించారు. 1985 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన శివ భాగ్యారావు, ఆంధ్రబ్యాంక్‌లో పనిచేస్తున్న త‌న భార్య కటికల స్వర్ణలత, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్లో పనిచేస్తున్న తమ్ముడు కటికల వెంకట్రావు, తండ్రి కటికల జార్జి ఉరఫ్ రామకోటి తో కలిసి ముప్పై గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో ఆ సేవా కార్యక్రమాల్ని ఓ ట్రస్ట్ పేరుపై చేయాలనే ఆలోచనతో తన తల్లి పేరుపై కటికల కాంతమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. ప్రస్తుతం 45 గ్రామాల్లో ఈ సొసైటీ పలు రకాల సేవలు అందిస్తోంది. తనలాగా భావసారూప్యత కలిగిన మరికొంతమంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల్ని క‌లుపుకుని స్నేహ క్ల‌బ్ ఏర్పాటు చేసి సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 2008 లో బిసి ఉద్యోగులు, అభ్యుదయవాదులు స్నేహ క్లబ్ తో చేతులు కలిపారు. 2001 లో ఏర్పాటైన ఈ క్లబ్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 12 వేల మందితో శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా స్నేహ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే 23 జిల్లాలతో కలిపి 202 క్లబ్లు ఏర్పాటయ్యాయి. 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2001 లో మొదలైన స్నేహ క్లబ్ ఇరవయ్యేళ్లుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2002లోనే ఇంత మంది అధికారులు, ఇన్ని కుటుంబాలు కలిశాయి కదా అని అందరి కోసం స్నేహ మేరేజ్ బ్యూరోని కూడా ఏర్పాటు చేశారు. స్నేహ క్లబ్ త‌ర‌ఫున ఏ జిల్లాకి ఆ జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి శని, ఆదివారాల్లో ఉద్యోగులు గ్రామాలబాట పట్టి పలు కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప‌త్రిక‌లు నిరాక‌రించ‌డంతో మన వార్తలు మనమే రాసుకోవాలని స్నేహవాణి పత్రిక స్థాపించారు. సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న క్ల‌బ్‌కి తగిన ఆదాయం కూడా రావాలనే ఉద్దేశంతో స్నేహ చిట్స్‌ని ఏర్పాటు చేశారు. మొత్తం లాభాల్ని ఛారిటీ కోస‌మే ఇస్తున్న సంస్థ ఇది. ఆ త‌ర్వాత బహుజనుల ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ కోసం... స్నేహ మ్యాక్స్‌ని ఏర్పాటు చేశారు. భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకుంటున్న బ‌హుజ‌న మ‌హిళ‌ల‌కి విముక్తి క‌ల్పించాల‌నే ఆలోచనతో స్నేహ మ్యాక్స్ ఏర్పాటైంది. ప్ర‌స్తుతం ఈ సంస్థకి వస్తున్న పదిశాతం లాభాల్ని కూడా స్నేహ క్లబ్‌కే ఇస్తున్నారు.

@ మీడియా రంగంలో

2013 జనవరిలో స్నేహ క్లబ్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి స్నేహ టీవీని స్థాపించారు. దీంతోపాటు ప్రజాపాలన పత్రికని కూడా స్థాపించారు. అంబేడ్కర్ వ‌ర్ధంతి రోజున ‘మాస్టర్ కీ చానల్ (అంబేడ్కర్ టీవీ)ని మొదలుపెట్టబోతున్నారు. ఆకాశంలో సగం అంబేడ్కర్ టీవిలో సగం మహిళలు అన్న భావనతో యూ ట్యూబ్ లైవ్ ప్రారంభ బాధ్యతలు పూర్తిగా మహిళా డైరెక్టర్లకు అప్పగించారు. ‘మాస్టర్ కీ చానల్’ (అంబేడ్కర్ టీవీ) 11 ఏప్రియల్ 2020 న ‘యూ ట్యూబ్ లైవ్’ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ టీవీని మొదలుపెట్టబోతున్నారు. సామాజిక బాధ్యతతో చేయ‌బోతున్న వ్యాపారం ఇది.

Send an enquiry